Sunday, March 1, 2020

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంతో ఫొటో దిగిన ఆనంద్‌ మహీంద్ర

  • ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఆనంద్‌ మహీంద్ర
  • తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసిన బిజినెస్‌మన్‌
  • ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనంటోన్న నెటిజన్లు
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫొటో దిగారు. ఈ ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. విలువైన జ్ఞాపకాలతో ఉండే తన ఆల్బమ్ కోసం ఈ ఫొటో దిగానని, ఇది మార్వెల్ పాత్ర దగ్గర కాదని, నిజమైన ఐరన్ మ్యాన్ పాదాల వద్ద అని ఆయన పేర్కొన్నారు.

వల్లభాయ్ పటేల్‌తో పాటు ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. పిక్‌ ఆఫ్‌ ది డే అంటూ రిప్లై ఇస్తున్నారు. నిజమైన హీరో ఆనంద్‌ మహీంద్ర అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

కర్ణాటకలో ప్రబలుతున్న మంకీ ఫీవర్... ఇప్పటికే ఇద్దరు మృత్యువాత

  • భారత్ లో ఉనికి చాటుకుంటున్న మరో మహమ్మారి
  • శివమొగ్గ ప్రాంతంలో 55 మందికి సోకినట్టు గుర్తింపు
  • కైసనూరు ఫారెస్ట్ డిసీజ్ కే మరో పేరు మంకీ ఫీవర్
కరోనా వైరస్ అనేక దేశాలను హడలెత్తిస్తున్న తరుణంలో భారత్ లో మరో ప్రమాదకర వైరస్ తన ఉనికి చాటుకుంటోంది. మంకీ ఫీవర్ వైరస్ గా పిలిచే ఈ మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో 55 మంది మంకీ ఫీవర్ బారినపడినట్టు గుర్తించారు. వాస్తవానికి ఈ వ్యాధిని కైసనూరు ఫారెస్ట్ డిసీజ్ గా వ్యవహరిస్తారు. దీనికే మంకీ ఫీవర్ అని మరో పేరుంది. మంకీ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ఆందోళన హెచ్చుతోంది. సిద్ధపుర తాలూకాకు చెందిన భాస్కర్ గణపతి హెగ్డే (64), మరో మహిళ మంకీ ఫీవర్ కారణంగా మరణించినట్టు అధికార వర్గాలంటున్నాయి.

ఏపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైంది: యనమల






  • సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింది

  • రకరకాల మాఫియాలు సంపదను దోచుకుంటున్నాయి

  • ప్రభుత్వం ఆదాయం దారుణంగా పడిపోయింది



ఏపీలో ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా తయారైందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని, ప్రభుత్వం ఆదాయం దారుణంగా పడిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో రకరకాల మాఫియాలు సంపదను దోచుకుంటున్నాయని, ఇక, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ రౌడీయిజం చేయిస్తోందని ఆరోపించారు. దీని కారణంగా విశాఖలో పెట్టబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. విశాఖలో చంద్రబాబును ఇటీవల అడ్డుకున్న ఘటనపై ఆయన స్పందిస్తూ బాబుపై చెప్పులు, టమాటాలు విసిరింది విశాఖ వాసులు కాదని అన్నారు. ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాలని అన్నారు.

'నేనే తప్పు చేయలేదు' అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి






  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన

  • నర్సుగా పనిచేస్తోన్న అమ్మాయి (24)

  • ఆసుపత్రిలో చోరీ

  • తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని మనస్తాపం



చిత్తూరు జిల్లా మదనపల్లెలో విషాద ఘటన చోటు చేసుకుంది.  మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సావిత్రి (24) సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రెండురోజుల కిందట నైట్‌ డ్యూటీకి వెళ్లగా, అదే రోజు ఎవరో ఆసుపత్రిలోని ఓ వార్డులో ఓ రోగి నుంచి రూ.2 వేల నగదు, ఏటీఎంకార్డులను చోరీ చేశారు.

దీంతో రోగి బంధువులు ఆసుపత్రికి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో సావిత్రిని ఆసుపత్రి యాజమాన్యం విచారించింది. ఆమే చోరీ చేసిందని రోగి బంధువులు, తోటి సిబ్బంది మాట్లాడుకున్నారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. నాలుగు పేజీల సూసైడ్‌నోట్‌ రాసి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని, చనిపోయింది.

తాను తప్పూ చేయలేదని, ఆ రోగి వద్ద డబ్బు ఎవరు చోరీ చేశారో తనకు తెలియదని ఆమె ఆత్మహత్య లేఖలో తెలిపింది. రోగి బంధువులు, తోటి సిబ్బంది తనపైనే అభాండం వేస్తూ మాట్లాడుకుంటున్నారని చెప్పింది. తన చావుతోనయినా తనను నమ్మాలని పేర్కొంది.

పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా ప్రీ లుక్‌ విడుదల.. రేపు సర్‌ప్రైజ్‌ అంటూ ప్రకటన.. ఫ్యాన్స్ ఖుషీ






  • రేపు ఫస్ట్‌లుక్‌ విడుదల

  • సినిమా పేరు కూడా రేపే విడుదల?

  • ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌



సినీనటుడు పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ వచ్చేస్తుందని ఇటీవలే సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే, పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ ఎప్పుడొస్తుందన్న విషయంపై ప్రకటన రాలేదు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తమ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.  టైటిల్‌ కూడా రేపు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లాయర్‌ సాబ్, వకీల్‌ సాబ్‌ అనే టైటిల్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రేపు సినిమా బృందం ఇచ్చే సర్‌ప్రైజ్‌ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి 'ప్రకృతి' చిట్కా!

  • ఒత్తిడి తగ్గాలంటే ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు ప్రకృతిలో గడపాలి
  • ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి
  • తేల్చిన అమెరికా పరిశోధకులు
ఉదయాన్నే పాఠశాలకు, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతూ పోటీ ప్రపంచంలో చిన్నప్పటి నుంచే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆటలు ఆడకపోవడం, ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఉండకపోతుండడంతో వారిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. పిల్లల్లో ఒత్తిడి తగ్గాలంటే ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు ప్రకృతిలో గడపాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని తేల్చారు. తమకు ఇష్టమైన రంగాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పారు. 15-30 సంవత్సరాల వయసున్న కొంత మందిపై చేసిన పరిశోధనల ఫలితంగా అమెరికా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్కుల్లో గడిపిన వారిలో మానసికంగా సానుకూల మార్పు కనిపించిందని తెలిపారు.

పాలు, పెరుగు తీసుకుంటే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తక్కువట!

  • గుర్తించిన ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు 
  • తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మందిపై పరిశోధన
  • ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించన పరిశోధకులు
మనిషి శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్‌ అంటారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తే మెదడు కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. నిలువెత్తు మనిషికి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ప్రమాదకర స్థితి వల్ల మనిషి అకాల మరణం చెందుతాడు. అయితే, మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే ఈ ముప్పును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించి ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. ఫైబర్‌ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.

'ఒత్తిడి' గురించి మరో కొత్త విషయం కనిపెట్టిన పరిశోధకులు






  • వివరాలు తెలిపిన అమెరికాలోని పెన్‌ స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు

  • ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా 

  • ఒత్తిడి వల్ల తోటివారి నైతిక మద్దతు 

  • తామున్నామన్న భరోసా  



ఎంతటి మనిషినైనా ఒత్తిడి చిత్తు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కొంత మేరకు ఒత్తిడి వల్ల పనిలో రాణిస్తారని కూడా చాలా మందికి తెలుసు. అయితే, ఒత్తిడి గురించి పరిశోధనలు చేసిన అమెరికాలోని పెన్‌ స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. మనిషిలో ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పారు.

పని, చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో మనుషులు పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తోటివారు నైతిక మద్దతు పలుకుతున్నారని గుర్తించారు. వారికి తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారని తేల్చారు. దీంతో ఒత్తిడి వల్ల సామాజిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంతో ఫొటో దిగిన ఆనంద్‌ మహీంద్ర

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఆనంద్‌ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసిన బిజినెస్‌మన్‌ ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనంటోన్న నెటిజన్...